బాన్సువాడ డిసెంబర్ 22
తెలంగాణ ఎక్స్ ప్రెస్
ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సూర్యుడు వెంకటస్వామి 10 వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ వాదనికి నిలువెత్తు నిదర్శనం కులం మతం, జాతి బేధం లేకుండా యావత్ తెలుగు సమాజంలో అందరూ నోరారా కాకా అని పిలుచుకుoటున్న ఏకైక వ్యక్తి వెంకటస్వామి, కార్మికులను చైతన్యం వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపి, వారి కోసం 80,000 మందికి, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ ప్రాంతాలలో ఉండే కార్మికులకు అవాసాలను కల్పించిన మహనీయుడు, మూడు సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎంపీ. 3 సార్లు కేంద్ర మంత్రిగా ప్రజలకు అనేకవిధాలుగా సేవాలoదిoచారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో బిసి లకు మరియు మహిళలకు రిజర్వేషన్ లు అమలు అయ్యేవిధంగా కృషి చేసాడు.తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈ ప్రాంత ప్రజల హక్కుల పోరాటం చేసారని, కులాలకు అతీతంగా తెలంగాణ ప్రజలకు సేవచేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని అయన సూచించన మార్గంలో నడవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, ఏఎంసి మాజీ చైర్మన్ నేర్రే నర్సింలు,మాల మహానాడు అధ్యక్షులు మల్లూరు సాయిలు,డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్, నర్సింలు, విట్టల్, గోపాల్, మన్నే సాయిలు, భూషణ్, ఆనంద్, వినోద్,ఆంజనేయులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
