– 108 వాహనం పరిస్థితి ఇలా..!!రోగులను తరలించేది ఎలా..?
– జిల్లా కేంద్రంలో రాత్రి అంబులెన్స్ పరిస్థితి ఇది
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, జనవరి 8 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ప్రమాదం జరిగితే వెంటనే ప్రజలకు గుర్తుకొచ్చేది 108 వాహనం, అత్యవసరంగా, తొందరగా ప్రమాద స్థలికి చేరీ ప్రమాద బాధితులను ఆసుపత్రులకు చేరవేసే ఆంబులెన్స్ కి అవస్థ వచ్చి పడిన దృశ్యాలు బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కనిపించింది. నలుగురు కలిసి 108 వాహనాన్ని తోస్తు కనిపించిన దృశ్యం అందరినీ ముక్కున వేలేసుకుని చూసే విధంగా చేసింది.. జిల్లా కేంద్రంలో అంబులెన్స్ ల పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రమాద స్థలంలో ప్రమాద బాధితుల కోసం సమయానికి చేరుకోకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. కావున అంబులెన్స లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి కండిషన్లో ఉండే విధంగా చూడాలని పట్టణ ప్రజలతోపాటు, అంబులెన్స్ నడిపే డ్రైవర్లు కూడా విన్నవిస్తున్నారు. సమయానికి ప్రమాదా బాధితుల చెంతకు అంబులెన్స్ చేరకపోతే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు వాపోతున్నారు. ఇట్టి విషయాలను వైద్యశాఖ అధికారులు గానీ, జిల్లా కలెక్టర్ గాని వెంటనే స్పందించి అంబులెన్స్ లకు మరమ్మత్తులు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

