Home తాజా వార్తలు *హాస్టల్ విద్యార్థుల కోసం 100 బెడ్ షీట్స్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు రైస్ మిల్లర్స్ అందజేత*

*హాస్టల్ విద్యార్థుల కోసం 100 బెడ్ షీట్స్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు రైస్ మిల్లర్స్ అందజేత*

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నూతన సంవత్సరం 2025 వేడుకల సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరిలు మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు చలికాలం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తమ వంతు చేయూత అందించేందుకు గాను మిల్లర్స్ అసోసియేషన్ నుంచి 100 బెడ్ షీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, తహసిల్దార్ హరిబాబులకు బొకేలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment