👉 *హాజరైన సిద్ధార్థ, చైర్మన్ భార్గవ్, బిఆర్ఎస్ నేతలు*
మిర్యాలగూడ జనవరి 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని 6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాసరావు కుమారుడు రోహిత్ చౌదరి కూతురు లక్ష్మీ ప్రసన్నల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ సమీపంలో గల శ్రీమన్నారాయణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి ( రాంబో) ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ, పూనాటి లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రశాంత్, జె ఎస్ గ్రాఫిక్స్ అధినేత నాగేశ్వరరావు, ఆర్టీసీ కార్మిక నేత రామావతారం, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వీర కోటిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూం, బిఆర్ఎస్ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షోయబ్, మాజీ కౌన్సిలర్ మాజీద్, వింజం శ్రీధర్, కోటేశ్వరరావు, వినోద్ నాయక్, ఫయాజ్, తోపాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు బిఆర్ఎస్ నాయకులు శ్రేణులు హాజరై సాదినేని రోహిత్ చౌదరి, లక్ష్మీ ప్రసన్న లను ఆశీర్వదించారు.