Home తెలంగాణ బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు….

బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 10,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్ పల్లి ఎంపిపిఎస్ పాఠశాలలో, 11 సంవత్సరాలు పని చేసి ఇటీవలే బదిలీ అయిన ఎన్.హరిత, ఎం.నాగరాణి ఉపాధ్యాయినీలకు, మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించినట్లు పాఠశాల హెచ్ ఎం గులాం షాఖీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హెచ్ ఎం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ…. ఉపాధ్యాయులుగా హరిత, నాగరాణి లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన నిబద్దతను కొనియాడారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని, వెళ్లిన చోట కూడా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని అన్నారు. పిదప సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోండ్ల రాజ్యలక్ష్మి సాయిలు, సొసైటి డైరెక్టర్ నాగం గోపి కృష్ణ, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు నర్సవ్వ, గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజు , పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ఇష్రత్ , స్వాతి, అంగన్ వాడి టీచర్ రుకుంబాయి, మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్వాహకులు, పూర్వ విద్యార్తులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

You may also like

Leave a Comment