Home Latest కుండపోత వానలతో పొంగిపొర్లుతూన్న వాగులు రహదారులపై భారీ వృక్షాలు నేలకోరిగాయి

కుండపోత వానలతో పొంగిపొర్లుతూన్న వాగులు రహదారులపై భారీ వృక్షాలు నేలకోరిగాయి

by Telangana Express

మంచిర్యాల, జులై 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గత నాలుగు రోజులుగా కురుస్తున్న గుండెపోత వానలతో వాగులు పొంగిపొర్లుకు, రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. కవ్వాల అభయ రణ్యం అటవీ ప్రాంతం నుండి వరద ఎక్కువ రావడం శుక్రవారం రాత్రి కురిసిన వానతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం వాగు పొంగిపొర్లుతూ వరద ఎక్కువ కావడంతో శివారులో ఉన్న ఇండ్లలోకి నీరులోకి ప్రవేశించాయి. దీంతో వానలో రాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల నిర్మల్ వైపు రహదారిపై వెళ్లే వాహనాలు జన్నారం మండలం చింతగూడ బస్ స్టాప్ సమీపంలో బొమ్మన వద్ద భారీ వృక్షం నేలకొరవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షాన్ని రోడ్డుపై తొలగించడంలో అనేక సమయం తీసుకోవడం జరిగింది. భారీ వర్షంలో వృక్షాన్ని రోడ్డు నుండి తొలగిస్తున్నారు. జన్నారం మండలంలో కుండపోత వానులకు రైతుల పంటలకు వేసిన నారు నీటి వరదకు కొట్టుకుపోయింది, పత్తి, కంది, మొక్కజొన్న, పంటలోకి నీరు చేరడంతో రైతుల పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులను ప్రభుత్వం ఆదుకొని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు మరో మూడు రోజులు ఇలాగే వానాలు కులుస్తాయని తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమమతంగా ఉంటూ ఇంటి నుండి బయటకు రావాలనుకుంటే అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment