మండలంలో రామాలయం ఆంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలు
శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా శోభయాత్రలో అంబరాన్ని అంటిన భక్తుల సంబరాలు
మంచిర్యాల, జనవరి 23, (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య లో శ్రీరాముని జన్మస్థలంగా పండితులు, అధికారులు, నాయకులు, ప్రజల, భక్తుల మధ్యన ప్రాణ ప్రతిష్టించారు. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కేతేస్వార స్వామి, కంకాలమ్మ, ఆలయాల్లో ఆలయ పూజారి బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జక్సన్ నాయక్, ఆలయ కమిటీ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 28న ఈర్లగుట్టపై వెలిసిన శివుడు, కేతేశ్వర స్వామి, కంకలమ్మ, నల్ల పోచమ్మ, (పొనకల్ ముదిరాజ్ సంఘం పెద్దమ్మ తల్లి నిలయం సమీపాన) ఆలయాలలో సమీపంలో జాతర సాగుతుందని దేవాలయాల కమిటీ, పూజారి తెలియజేశారు. అదేవిధంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న దేవాలయాలలో ప్రత్యేక పూజలు పూజారులచే నిర్వహించి భక్తులు శ్రీరాముని భక్తిని చాటుకుని, శోభాయాత్రలో అంబరాన్ని అంటిన భక్తుల సంబరాలు జరిగాయి. పొనకల్ మేదర్ వాడలో ఉన్న భక్తాంజనేయ స్వామి మహాలక్ష్మి సహిత దేవాలయంలో వేద పండితులు నరహరి శర్మ, గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్య రాముని పూజిత తలంబ్రాలతో భక్తులను ఆశీర్వదించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా మండలంలో గ్రామాల్లో వీధుల్లో శ్రీరాముని శోభయాత్ర భక్తులు గానా భజనలతో సంబరాలు జరిపారు. జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్మాపూర్ రామాలయంలో, చింతగూడ గ్రామంలో, జన్నారం పట్టణ కేంద్రంలోని రారామాలయంలో భక్తులు అయోధ్య శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా పూజారులతో పూజలు నిర్వహించారు. మండలంలోని హనుమాన్ భక్తులు, హనుమాన్ చాలీసా చదివి భక్తితో భజనలు చేశారు. శ్రీరాముని భక్తి గీతాలను వినిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. గ్రామంలోని దేవాలయాల్లో గ్రామస్తులు ప్రత్యేక పూజలు పూజర్లుచే జరిపించారు. మండలంలోని పలు గ్రామాలు శ్రీరాముని విగ్రహాన్ని శోభయాత్ర తో ఊరేగింపులో శ్రీరాముని భక్తి గీతాలను పాడారు. జన్నారం మండలంలోని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పాత పోనకల్ హనుమాన్ భక్తులు గ్రామంలోని శ్రీ ఆంజనేయ నిలయంలో పూజలు నిర్వహించి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గ్రామంలో, పలు వీధులలో విగ్రహాన్ని గ్రామ హనుమాన్ రాముని భక్తులు, శ్రీరామున్ని ఊరేగించారు. మండలంలోని పలు ఆలయాల్లో గ్రామ కమిటీ దేవాలయాల గ్రామ ఆలయ కమిటీ ల ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఆంజనేయ రామ భక్తులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, పాల్గొన్నారు.